ఆదివారం 29 మార్చి 2020
National - Mar 21, 2020 , 01:59:01

‘సామాజిక దూరం పిలుపునిస్తూ..పార్లమెంట్‌ నిర్వహణ ఎందుకు?’

‘సామాజిక దూరం పిలుపునిస్తూ..పార్లమెంట్‌ నిర్వహణ ఎందుకు?’

ముంబై: కరోనావైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిస్తున్న ప్రధాని మోదీ, ఎంపీలు సహా ఇతర సిబ్బంది దాదాపు వెయ్యి మంది ఒకచోటికి చేరే పార్లమెంట్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని శివసేన ప్రశ్నించింది. ఆదివారం జనతాకర్ఫ్యూ పాటించాలని.. నిగ్రహం, సంకల్పంతో వైరస్‌వ్యాప్తిని నియంత్రిద్దామంటున్న మోదీ, రాజకీయ కారణాలతోనే పార్లమెంట్‌ సమావేశాలను కొనసాగిస్తున్నారని తన అధికారపత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌లో ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తీసుకుంటున్న చర్యలకు మద్దతు కోసమే పార్లమెంట్‌ సమావేశాలను కొనసాగిస్తున్నారని ఘాటుగా విమర్శించింది.  

31 వరకు మూసివేత: ఉద్దవ్‌ థాక్రే

కరోనా వైరస్‌ కట్టడికి మహారాష్ట్రలోని ముంబై, పుణె, పింప్రి, నాగ్‌పూర్‌లో నెలాఖరువరకు జనసమ్మర్ధ ప్రదేశాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, వినోద కార్యకలాపాలను రద్దుచేస్తున్నట్టు సీఎం ఉద్దవ్‌థాక్రే చెప్పారు. అత్యవసర సేవ లనే అనుమతినిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగుల హాజరు ను 25 శాతానికి కుదిస్తున్నట్లు తెలిపారు. ముంబైలో ప్రజారవాణా నిలిపివేయడమే తమ చివరి అస్త్రమన్నారు. 


logo