బుధవారం 08 జూలై 2020
National - Jan 25, 2020 , 09:42:32

పాక్‌, బంగ్లా ముస్లింల‌ను తరిమేయాలి..

పాక్‌, బంగ్లా ముస్లింల‌ను తరిమేయాలి..

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన ముస్లింల‌ను దేశం నుంచి త‌రిమివేయాల‌ని శివ‌సేన అభిప్రాయ‌ప‌డింది.  ఆ పార్టీకి చెందిన సామ్నా ప‌త్రిక‌లో ఈ అభిప్రాయాన్ని వినిపించారు.  పాక్‌, బంగ్లా నుంచి వ‌చ్చిన ముస్లింల‌ను వారివారి స్వ‌దేశాల‌కు పంపించేయాల‌ని, ఇందులో ఎటువంటి అనుమానం లేద‌ని సామ్నా పేర్కొన్న‌ది. అయితే ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంలో లోపాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ అభిప్రాయ‌ప‌డింది. శివ‌సేన పార్టీ ఎప్పుడూ హిందుత్వ కోసం పోరాడింద‌ని, త‌మ పార్టీ జెండా రంగును మార్చేది లేద‌ని, సీఏఏలో అనేక లోపాలు ఉన్నాయ‌ని సామ్నా త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. పార్టీ జెండా రంగు మార్చిన‌ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక‌రేపై శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది.   logo