కేంద్రం ఒత్తిళ్లకు భయపడం : సంజయ్ రౌత్

ముంబై : కేంద్రం ప్రభుత్వ ఒత్తిళ్లకు శివసేన భయపడదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రంపై రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోంది. వీటిని ఎలా ఎదుర్కోవాలో మహారాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని వ్యూహాత్మకంగా రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలను మహారాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. వాటికి మేం బయపడం.
మహారాష్ట్ర, పశ్చిమబెంగాళ్ రాష్ట్రాలపై కేంద్రం రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడుతోంది’ అని రౌత్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నాటి బ్రిటిషర్లతో పోల్చోరు. ప్రజలను అణచివేసేందుకు నాడు బ్రిటిషర్లు అవలంబించిన వ్యూహాలను కేంద్రం అనుసరిస్తోందని ఆక్షేపించారు. అంతకుముందు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ), సీబీఐ సంస్థలను కుక్కలతో పోలుస్తూ చిత్రీకరించిన కార్టూన్‌ను షేర్ చేశారు. దేశ ప్రజలు వీటిని ఇదేవిధంగా భావిస్తున్నారని ట్యాగ్‌లైన్ జోడించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఈనెల 30న అఖిలపక్ష సమావేశం
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్‌జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్‌మేళా
- భూటాన్‌కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల