బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 15:46:41

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు శివ‌సేన ప్ర‌శంస‌లు

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు శివ‌సేన ప్ర‌శంస‌లు

ముంబై : బీజేపీ నాయ‌కుడు, మ‌హారాష్ర్ట మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌పై శివ‌సేన ప్ర‌శంస‌లు కురిపించింది. రాష్ర్టంలో ప్రతిపక్ష నాయకుడిగా తాను మంచి పని చేస్తున్న‌ట్లు శివసేన శనివారం ప్రశంసించింది. కోవిడ్‌-19 కి వ్యతిరేకంగా పోరాటంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఫడ్నవీస్ సంతృప్తి వ్యక్తం చేసినందున, ఇది ప్రభుత్వంతో పాటు కరోనా వైరస్ రోగుల మనోస్థైర్యాన్ని పెంచిందని అధికార పార్టీ పేర్కొంది. 

క‌రోనా వైర‌స్ సోకితే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాల్సిందిగా గిరీష్ మ‌హాజ‌న్‌కు చెప్పారు. ఈ న‌మ్మ‌కం ప్రభుత్వానికి, రాష్ట్రంలోని కోవిడ్‌-19 రోగుల‌కు ధైర్యాన్ని పెంచుతుంది. అందుకు ఫ‌డ్న‌వీస్‌ను ప్రశంసించాల‌ని పార్టీ మౌత్ పీస్ సామ్నా సంపాదకీయంలో శివ‌సేన పేర్కొంది. ఈ విష‌యంలో ఫడ్నవీస్‌ను ప్రశంసించాల్సిందిపోయి త‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇది సరైంది కాదంది. 

ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మంచి పని చేస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ తెలిపింది. కోవిడ్‌-19 సహాయక చర్యల‌ను, ఆరోగ్య సౌకర్యాలను పర్యవేక్షించడానికి ఫడ్నవీస్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులపై ఆయ‌న సంతృప్తి వ్యక్తం చేసిన‌ట్లు శివ‌సేన తెలిపింది.


logo