సోమవారం 08 మార్చి 2021
National - Jan 25, 2021 , 21:25:02

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ:  భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర  ప్రభుత్వం ఇవాళ  ప్రకటించింది. 2021 ఏడాదికి   పద్మ విభూషణ్‌-7 , పద్మభూషణ్‌-10 , పద్మ శ్రీ-102  ఇలా మొత్తం 119  మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.    72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.  దివంగత   ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని కేంద్రం పద్మ విభూషణ్‌తో గౌరవించింది.  కళా రంగంలో తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

పద్మ విభూషణ్‌:

షింజో అబే(జపాన్‌ మాజీ ప్రధాని)

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(గాయకుడు)

బెల్లె మోనప్ప హెగ్డే(వైద్యరంగం)

నరీందర్‌ సింగ్‌(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, అమెరికా‌)

మౌలానా వహిదుద్దీన్‌ ఖాన్‌(ఆధ్యాత్మికత)

బీబీ లాల్‌(ఆర్కియాలజీ)

సుదర్మన్‌ సాహూ(ఆర్ట్‌)

VIDEOS

logo