బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 15:55:38

క‌రోనా రోగుల సేవ‌లో బాలీవుడ్ న‌టి

క‌రోనా రోగుల సేవ‌లో బాలీవుడ్ న‌టి

ముంబై: ‌బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి గ‌త మూడు నెల‌లుగా క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూ త‌న ద‌యార్థ్ర హృద‌యాన్ని చాటుకుంటున్న‌ది. సినీరంగ ప్ర‌వేశానికి ముందే ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆస్ప‌త్రి నుంచి న‌ర్సింగ్ కోర్సులో డిగ్రీ కూడా పూర్తిచేసిన శిఖా మ‌ల్హోత్రా.. బాంబే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప‌రిధిలోని ఆస్ప‌త్రిలో పేషెంట్ కౌన్సిల‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశానికి మ‌నంద‌రం చేయాల్సింది చాలా ఉన్న‌ద‌ని, అందులో త‌న‌వంతుగా చిన్న సాయం చేస్తున్నాన‌ని శిఖా చెప్పింది. గ‌త మూడు నెల‌లుగా తాను రోగుల‌కు ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాన‌ని తెలిపింది.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo