సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 25, 2020 , 21:10:52

కాస్త మెరుగైన షిబు సోరెన్‌ ఆరోగ్యం

కాస్త మెరుగైన షిబు సోరెన్‌ ఆరోగ్యం

రాంచీ :  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు షిబు సోరెన్‌ కరోనా బారినపడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో రెండురోజుల క్రితం రాంచీలోని మేదంత దవాఖానలో ఆయనను చేర్చారు. మంగళవారం ఆరోగ్యం క్షీణించడంతో హెలికాప్టర్ ద్వారా గురుగావ్‌లోని మేదంత దవాఖానకు తరలించారు. అక్కడ ఆయనకు ప్లాస్మా చికిత్స చేయడంతో మునుపటి కంటే కాస్త ఆరోగ్యం మెరుగుపడినట్లు రాంచీ గ్రామీణ ఎస్పీ నౌషద్ ఆలం తెలిపారు.

సోరెన్‌తోపాటు అతడి భార్య రూపి సోరెన్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. జేఎంఎం స్థాపించి జార్ఖండ్‌ రాష్ట్ర సాధనోద్యమానికి నాయకత్వం వహించి బీహార్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా సోరెన్‌ ఘనత సాధించారు. యూపీఏ -1 హయంలో కేంద్ర కేబినెట్ మంత్రిగానూ ఆయన పనిచేశారు. జులైలో జార్కండ్‌ క్యాబినెట్‌ మంత్రితోపాటు ఓ శాసనసభ్యుడు కరోనా బారినపడగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోపాటు ఆయన భార్య కల్పన కోవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo