బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 15:21:45

డీడీలో షారుక్ సర్కస్, రజిత్ బ్యోమకేశ్ బక్షీ

డీడీలో షారుక్ సర్కస్, రజిత్ బ్యోమకేశ్ బక్షీ

హైదరాబాద్: దూరదర్శన్ అలనాటి సీరియల్స్ అబిమానులకు శుభవార్త. రామాయణ్, మహాభారత్ సీరియల్స్ దుమ్ముదులిపిన డీడీ తాజాగా షారుక్‌ఖాన్ కెరీర్ తొలినాళ్లల్లో నటించిన సర్కస్ (1989), రజిత్ కపూర్ నటించిన బ్యోమకేశ్ బక్షీ (1993) వంటి సీరియల్స్ పై దృష్టి సారించింది. ఈ పునఃప్రసారాలు లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన కోట్లాదిమందిని అలరిస్తాయని భావిస్తున్నారు. వికీ అజీజ్ మీర్జా, కుందన్ షా దర్శకత్వంలో రూపొందిన సర్కస్‌లో రేణుకా షహానే, పవన్ మల్హోత్రా, అసుతోశ్ గోవారీకర్ ఇతర పాత్రల్లో నటించారు. గోవారీకర్ తదగనంతర కాలంలో పెద్ద దర్శకుడుగా ఎదిగిన సంగతి తెలిసిందే. 1989లో ఫౌజీ, సర్కస్ తో సీరియల్ నటునిగా రంగప్రవేశంమ చేసిన షారుక్ 1992లో దీవానా చిత్రంతో బాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. సర్కస్ మార్చి 28 వ తేదీ నుంచి డీడీ నేషనల్‌లో రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు డీడీ నేషనల్‌లో రజిత్ కపూర్ డిటెక్టివ్ సీరియల్ బ్యోమకేశ్ బక్షీ ప్రసారం అవుతుంది. ఇందులో డిటెక్టివ్ బక్షీ సహాయకుని పాత్రలో కేకే రైనా నటించారు. డీడీ భారతిలో రామాయణ్, మహాభారత్ లను దూరదర్శన్ ప్రారంబించిన సంగతి తెలిసిందే.


logo