శనివారం 16 జనవరి 2021
National - Dec 19, 2020 , 16:49:40

ఎన్నిక‌ల నాటికి మిగిలేది ఆమె ఒక్క‌రే: అమిత్ షా

ఎన్నిక‌ల నాటికి మిగిలేది ఆమె ఒక్క‌రే: అమిత్ షా

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం అక్క‌డ బీజేపీదే అధికార‌మ‌ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. దాదాపు 200కు పైగా సీట్ల‌తో తాము బెంగాల్‌లో అధికారం చేప‌డుతామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇవాళ ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లిన అమిత్ షా.. తొలిరోజు ప‌శ్చిమ మిడ్నాపూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 11 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, మ‌రో మాజీ ఎంపీతోపాటు ఇత‌ర పార్టీల నుంచి కూడా ప‌లువురు నేత‌లు బీజేపీలో చేరారు. 

అనంత‌రం స‌భ హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా.. తృణ‌మూల్ సీనియ‌ర్ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నార‌ని చెప్పారు. త‌మ పార్టీలో చేరిక‌లు పెరుగుతుండ‌టంతో బీజేపీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ద‌ని మ‌మ‌తా దీదీ ఆరోపిస్తున్నార‌ని, మ‌రి ఆమె సొంత పార్టీ పెట్టుకోవ‌డం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించ‌లేదా అని ప్ర‌శ్నించ‌లేదా అని షా ప్ర‌శ్నించారు. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, ఎన్నిక‌ల నాటికి తృణ‌మూల్ కాంగ్రెస్ ఆమె ఒక్క‌రే మిగులుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

మీరు బెంగాల్ మూడు ద‌శాబ్దాల‌పాటు కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ఆ త‌ర్వాత 27 ఏండ్లు క‌మ్యూనిస్టుల‌కు అప్ప‌గించారు. గ‌త ప‌దేండ్లుగా మ‌మ‌తా దీదీకి అధికారం ఇచ్చారు. ఎవ‌రు అధికారంలో ఉన్నా రాష్ట్రం త‌ల‌రాత మార‌లేదు. కానీ, ఒక్క ఐదేండ్లు బెంగాల్‌లో అధికారాన్ని బీజేపీకి ఇవ్వండి. మేం రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌లా మార్చి చూపిస్తాం అని ఓటర్ల‌ను అమిత్ షా కోరారు.

ఇవి కూడా చ‌ద‌వండి..
బెంగాల్‌లో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయం: సువేందు
బీజేపీలో చేరిన సువేందు అధికారి
టీకా పంపిణీ.. ఏడాదికి 80 వేల కోట్లు
గుండెపోటుతో శివ‌సేన సీనియ‌ర్ నేత మృతి
కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తుపై చర్చించాం: పృథ్వీరాజ్ చవాన్

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.