బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 06:35:11

క‌మ‌లా.. అనుకున్న‌ది సాధించింది: మేన‌త్త స‌ర‌లా గోపాల‌న్‌

క‌మ‌లా.. అనుకున్న‌ది సాధించింది: మేన‌త్త స‌ర‌లా గోపాల‌న్‌

చెన్నై: అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారీస్‌పై ప్ర‌శంస‌లు వెళ్లువెత్తుతున్నాయి. క‌మ‌లా అనుకున్న‌ది సాధించింద‌ని ఆమె మేన‌త్త డా. స‌ర‌లా గోపాల‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్రాట్‌ల త‌ర‌ఫున బ‌రిలో దిగిన జో బైడెన్ విజ‌యం సాధించారు. అదే పార్టీ త‌ర‌ఫున భార‌త మూలాలు క‌లిగిన క‌మ‌లాహ్యారిస్ ఉపాధ్య‌క్షురాలిగా విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో అమె అనుకున్న‌ది సాధించింద‌ని గోపాల‌న్ చెప్పారు. 

క‌మ‌లా త‌న‌ చిన్న‌నాటి నుంచే మంచి వ్య‌క్తిగా ఎదిగింద‌ని వెల్ల‌డించారు. ఆమె ఎల్ల‌ప్పుడు మంచే చేస్తుంద‌ని తెలిపారు. ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న‌ది సాధించింద‌ని చెప్పారు. ఇత‌ర పేరెంట్స్ మాదిరిగానే తాము కూడా చిన్న‌నాటి నుంచి క‌మ‌లాహ్యారిస్‌ను ప్రోత్స‌హించామ‌ని ఆమె మేన‌మామ గోపాల‌న్ బాల‌చంద్ర‌న్ తెలిపారు. క‌మ‌లాహ్యారిస్ ఎక్క‌డా పొర‌పాట్లు చేయ‌కుండా చ‌క్క‌ని ప‌నితీరుతో ఈ స్థాయికి చేరుకున్న‌ద‌ని ఆయన చెప్పారు. తాను క‌మ‌లా ప్రమాణ స్వీకారానికి హాజ‌ర‌వుతాయ‌న‌ని చెప్పారు.