ఆదివారం 07 మార్చి 2021
National - Jan 23, 2021 , 01:27:27

క్షీణించిన శశికళ ఆరోగ్యం

క్షీణించిన శశికళ ఆరోగ్యం

  • దెబ్బతిన్న ఊపిరితిత్తులు
  • ఐసీయూలో ఉంచి కరోనా చికిత్స

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం ఆమెను పరప్పన అగ్రహార జైలు నుంచి బెంగళూరులోని బౌరింగ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ రెండు సార్లు ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌ అని వచ్చింది. ఆ దవాఖానలో సీటీస్కాన్‌ సదుపాయం లేకపోవటంతో విక్టోరియా దవాఖానకు తరలించారు. అక్కడ సీటీ స్కాన్‌ తీయగా కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అక్రమాస్తుల వ్యవహారంలో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉన్నది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె విడుదల కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ఇంతలో అస్వస్థతకు గురికావటం ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నది. 

VIDEOS

logo