వంటకాల్లో ఉల్లిపాయలు ఓ భాగం. అయితే, ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. అందులోనూ, తెల్ల ఉల్లిలోని విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిపాయలు తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేసే శక్తి ఉల్లిపాయకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తెల్ల ఉల్లిపాయలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సాయపడతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు.
తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి.
తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.