శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:16:53

ఆ వ్యాఖ్య‌లు శ్రీరాముడికి వ్య‌తిరేకంగా ఉన్నాయి..

ఆ వ్యాఖ్య‌లు శ్రీరాముడికి వ్య‌తిరేకంగా ఉన్నాయి..

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ముహూర్తం ఖ‌రారైన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆల‌య నిర్మాణాన్ని ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ త‌ప్పుపట్టారు. రాముడి ఆల‌య నిర్మాణంతో క‌రోనా వైర‌స్‌ను అంతం చేయాలేర‌ని ఆయ‌న విమ‌ర్శించారు. క‌రోనా వైర‌స్‌, లాక్‌డౌన్‌తో దెబ్బ‌తిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్టాల‌ని ప‌వార్ అభిప్రాయ‌ప‌డ్డారు.  మందిరం నిర్మిస్తే వైర‌స్ పోతుంద‌న్న భ్ర‌మ‌లో కొంద‌రు ఉన్నార‌ని ఎన్సీపీ నేత ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత ఉమాభార‌తి స్పందించారు. శ‌ర‌ద్ ప‌వార్ చేసిన వ్యాఖ్య‌లు శ్రీరాముడికి వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, అవి ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకం కాదు అని ఉమాభార‌తి అన్నారు.  


logo