బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 17:28:25

శ‌ర‌ద్ ప‌వార్ మ‌హారాష్ర్ట‌కు ప‌ట్టిన క‌రోనా వైర‌స్

శ‌ర‌ద్ ప‌వార్ మ‌హారాష్ర్ట‌కు ప‌ట్టిన క‌రోనా వైర‌స్

ముంబై : నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ పై భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు గోపీచంద్ ప‌డ‌ల్క‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. శ‌ర‌ద్ ప‌వార్ ను క‌రోనా వైర‌స్ తో పోల్చారు. శ‌ర‌ద్ ప‌వార్ మ‌హారాష్ర్ట‌కు ప‌ట్టిన క‌రోనా వైర‌స్ త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు బీజేపీ లీడ‌డ‌ర్. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న మ‌హారాష్ర్ట‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కానీ ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేదు. ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌ప్పుడూ దుర్భ‌ష‌లాడ‌ట‌మే ఆయ‌న‌కు తెలుస‌న్నారు. ఎలాంటి ఎజెండా లేని ప‌వార్ కు ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాలో మాత్ర‌మే తెలుసు అని గోపీచంద్ పేర్కొన్నారు.  

ధంగ‌ర్ స‌మాజానికి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వార్ సానుకూలంగా ఉన్నార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని ప‌డల్క‌ర్ స్ప‌ష్టం చేశారు. వీరి రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో రాజ‌కీయ డ్రామాలు ఆడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 


logo