శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 18:06:06

ఎన్డీయేలో ఎన్సీపీ చేరితే శరద్ పవార్‌కు పెద్ద పదవి : రామ్‌దాస్ అథవాలే

ఎన్డీయేలో ఎన్సీపీ చేరితే శరద్ పవార్‌కు పెద్ద పదవి : రామ్‌దాస్ అథవాలే

ముంబై: శివసేన మళ్లీ బీజేపీతో చేతులు కలపాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కోరారు. శివసేన తమతో కలిసి రాకపోతే మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఎన్డీయేలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. దీంతో భవిష్యత్తులో ఆయన పెద్ద పదవిని పొందవచ్చని చెప్పారు. శివసేనతో కలిసి ఉండటం వల్ల శరద్ పవార్‌కు ఎటువంటి ప్రయోజనం ఉండదని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఎన్డీయేకు శివసేన దూరమైంది. తాజాగా వ్యవసాయ బిల్లులకు నిరసనగా తొలి నుంచి ఎన్డీలో భాగస్వామ్యంగా ఉన్న పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగింది. కొన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీయే కూటమికి దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివసేన తిరిగి బీజేపీతో జతకట్టని పక్షంలో ఎన్డీయే కూటమిలో ఎన్సీపీ చేరాలని ఆయన పిలుపునిచ్చారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.