బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 17:09:39

2014 లోనే శివసేనను పక్కన పెట్టాలనుకున్న బీజేపీ

2014 లోనే శివసేనను పక్కన పెట్టాలనుకున్న బీజేపీ

ముంబై : రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో మహారాష్ట్రలోని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి ఒక విషయం వెల్లడించారు. శివసేనను పక్కనపెట్టి ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2014 లో బీజేపీ కిందామీదా పడిందని చెప్పారు. అయితే, ఆపరేషన్ లోటస్ మహారాష్ట్రలో విజయవంతం కాలేదని తెలిపారు. శివసేన మౌత్ పీస్ 'సామ్న'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ విషయాలు వెల్లడించారు.

తమ కూటమిలో ఎలాంటి విబేధాలు లేవని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఖచ్చితంగా ఐదేండ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటుందని చెప్పారు. దేశ మనోభావాలకు అనుగుణంగా లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఓటు వేశారని, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్ల మానసిక స్థితి మారిపోయిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మంచి పనితీరు కనబరిచినప్పటికీ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఇది ఘోరంగా విఫలమైందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ మార్పుకే ఓటు వేశారని చెప్పారు.

'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌సీపీ ఎప్పుడూ బీజేపీతో చర్చించలేదు. శివసేనను తొలగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆఫర్ బీజేపీ నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు 'ఠాక్రే ప్రభుత్వం' ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ప్రభుత్వాలను అస్థిరపరచడం అధికార దుర్వినియోగమే అవుతుంది అని పవార్ అన్నారు. 


logo