బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 19:23:25

దయచేసి వారిని రానివ్వండి

దయచేసి వారిని రానివ్వండి

ముంబై: వలస కార్మికులను స్వంత గ్రామాలకు తిరిగి రావడానికి ఆయా రాష్ట్రాలు అనుమతించేలా చూడాలని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ (ఎన్సీపీ) పార్టీ నాయకుడు శరద్‌పవార్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి  విజ్ఞప్తిచేశారు. ఈ విషయంపై వెంటనే దృష్టిసారించి అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాలని ఆయన ట్విట్టర్‌ వేదిక ద్వారా మోదీని కోరారు. వలస కార్మికులకు గౌరవంగా సాగనంపేందుకు అటు రైల్వేశాఖ, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం  తగు చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్‌ ద్వారా శరద్‌ పవార్‌.. మహారాష్ట్ర సీఎం  ఉద్దవ్‌ థాక్రేకు సూచించారు. వలస కార్మికుల  తరలింపు తలనొప్పిగా తయారైందని, ఔరంగాబాద్‌లో 16 మంది కార్మికులు పట్టాలపై పడుకొని గూడ్స్‌ రైలు కింద నలిగిపోవడం పట్ల విచారం వ్యక్తంచేశారు.


logo