శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 19:15:47

‘ఎన్‌సీపీ’కి శంకర్సింగ్‌ వాఘేలా రాజీనామా..

‘ఎన్‌సీపీ’కి శంకర్సింగ్‌ వాఘేలా రాజీనామా..

గాంధీనగర్‌ : గుజరాత్‌ నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే శంకర్సింగ్‌ వాఘేలా ఆ పార్టీకి రాజీనామా చేశారు.  సోమవారం తన రాజీనామా లేఖను ఎన్‌సీపీ అధ్యక్షుడు శరాద్‌పవార్‌కు పంపారు. పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు బాధ్యత వహించినా నాలుగు స్థానాలకు మూడింటిని బీజేపీ గెలుచుకుందని పేర్కొన్నారు.‘రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ఎన్‌సీపీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉంది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు, నాయకుల్లో నిరాశ ఆవహించి ఉంది’ అని తెలిపారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ నెల ప్రారంభంలో మాజీ ఎమ్మెల్యే జయంత్‌ పాటిల్‌ను ఎన్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి వాఘేలాకు అప్పగించిన విషయం తెలిసిందే. వాఘేలా గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగానూ పని చేశారు.logo