సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 22:59:39

శంకర్ సింగ్ వాఘేలా కొత్త పార్టీ.. ప్రజాశక్తి మోర్చా

శంకర్ సింగ్ వాఘేలా కొత్త పార్టీ.. ప్రజాశక్తి మోర్చా

అహ్మదాబాద్ : గుజరాత్ లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. గుజరాత్ వెటరన్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా.. ప్రజశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపనున్నట్టు ప్రకటించారు. ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వాఘేలా ఇంతకుముందు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్, ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జన్ సంఘ్ నుంచి బీజేపీ, రాజ్పా, కాంగ్రెస్‌, జన్‌ వికల్ప్‌ , నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీల్లో ఇన్నాళ్లు కొనసాగిన తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గుజరాత్‌ రాజకీయాల్లో మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిది స్థానాలకు త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు బరిలో నిలుస్తారని ప్రకటించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌ వికల్ప పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శంకర్‌ సింగ్‌ వాఘేలా.. తన పార్టీ బ్యానర్‌పై దాదాపు వందకు పైగా అభ్యర్థులను బరిలో నిలిపినా కనీసం ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు.


logo