శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 07:19:43

షారుక్ బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

షారుక్ బెయిల్ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్ల‌ర్ల‌కు సంబంధించిన  ఘ‌ట‌న‌లో అరెస్టైన షారుక్ ప‌ఠాన్ బెయిల్ పిటిష‌న్ ను ఢిల్లీ కోర్టు తిర‌స్క‌రించింది. నిందితుడు షారుక్ పిస్తోల్ తో పోలీసుల‌ను బెదిరించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించకుండా ప్ర‌భుత్వ విధానాల‌ కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా ఆందోళచేయ‌వ‌చ్చని,  హింసను ప్రేరేపించేలా ఆందోళ‌న నిర్వ‌హించ‌డం స‌రైంది కాద‌ని అద‌న‌పు సెష‌న్స్ జడ్జి సంజ‌వీ కుమార్ మ‌ల్హోత్రా పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో షారుక్ ప‌ఠాన్ కు  బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. వీడియో పుటేజీని ప‌రిశీలించిన త‌ర్వాత ఈ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్ ఇవ్వ‌లేమ‌న్నారు.  
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo