గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 01:02:54

అమిత్‌షా నివాసం వరకు నేడు మార్చ్‌

అమిత్‌షా నివాసం వరకు నేడు మార్చ్‌
  • షాహీన్‌బాగ్‌ ఆందోళనకారుల ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నివాసం వరకు ఆదివారం మార్చ్‌ నిర్వహించనున్నట్లు ‘షాహీన్‌బాగ్‌' నిరసనకారులు ప్రకటించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సీఏఏపై హోం మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు తాము సిద్ధమని, అయితే తమను చర్చలకు పిలిచే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. సీఏఏతో ఎవరికైనా సమస్య ఉంటే తనను కలిసి చర్చించవచ్చని అమిత్‌షా ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. హోం మంత్రిని కలిసేందుకు ఎలాంటి ప్రతినిధి బృందాన్ని పంపడం లేదని, తామందరమూ ప్రతినిధులమేనని పేర్కొన్నారు.  సీఏఏ వ్యతిరేక నిరసనలకు షాహీన్‌బాగ్‌ కేంద్రస్థానంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు అక్కడ నిరవధిక దీక్ష చేపడుతున్నారు. కాగా, అమిత్‌ షాతో సమావేశానికి ఇప్పటివరకు ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని హోం శాఖ వర్గాలు తెలిపాయి.  


logo
>>>>>>