శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 10:29:57

షెహీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల తొల‌గింపు

షెహీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల తొల‌గింపు

హైద‌రాబాద్‌:  సీఏఏకు వ్య‌తిరేకంగా ఢిల్లీలో నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌ను ఇవాళ ఉద‌యం పోలీసులు తొల‌గించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధించారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు లాకెళ్లారు. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సెక్ష‌న్ 144 ప్ర‌కారం భారీ సంఖ్య‌లో జ‌న సమూహాన్ని నిషేధించారు. ఆరుగురు మ‌హిళ‌లు, ముగ్గురు పురుషుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని జ‌ఫ్రాబాద్‌, తుర్క్‌మ‌న్ గేటు వ‌ద్ద ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న వారిని కూడా తొల‌గించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు రెండు రోజుల క్రితం సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


logo