శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 17, 2021 , 10:40:20

కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా

కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా

బెంగళూరు : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం కర్నాటకలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, బాగల్‌కోట్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ (జేఎన్‌ఎంసీ) మైదానంలో జరిగే బహిరంగ ర్యాలీలో ప్రసంగించనున్నారు. జిల్లాలోని కరకల్‌మట్టి గ్రామంలో ఉదయం కేదార్‌నాథ్ షుగర్, ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇథనాల్ ప్రాజెక్ట్‌తో పాటు కేఎల్‌ఈ హాస్పిటల్ అడ్వాన్డ్స్‌ సిములేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బెలగావిలోని జేఎన్‌ఎంసీ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. రెండు రోజుల పర్యటనలో శనివారం అమిత్‌షా శివమొగ్గలోని భద్రావతి రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.

VIDEOS

logo