శనివారం 29 ఫిబ్రవరి 2020
ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మాజీ ఐఏఎస్ అరెస్టు

ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మాజీ ఐఏఎస్ అరెస్టు

Feb 15, 2020 , 12:18:39
PRINT
ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద మాజీ ఐఏఎస్ అరెస్టు

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్‌, జేకేపీఎం పార్టీ చీఫ్ షా ఫైస‌ల్‌పై  ప‌బ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశారు.  ఫైస‌ల్‌ను అరెస్టు చేసి శుక్ర‌వారంతో ఆర్నెళ్లు ముగిసింది. అయితే అధికారులు మ‌ళ్లీ అత‌న్ని ప్ర‌జా భ‌ద్ర‌తా చ‌ట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌లో ప‌లువురు నేత‌ల్ని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.  ఫారూక్ అబ్దుల్లా, ఒమ‌ర్ అబ్దుల్లా, మెహ‌బూబా ముఫ్తీ, అలీ మొహ‌మ్మ‌ద్ సాగ‌ర్‌, స‌ర్తాజ్ మ‌దానీ, హిలాల్ లోన్‌, న‌యీమ్ అక్త‌ర్‌ల‌పైన కూడా ప్ర‌భుత్వం ప్ర‌జా భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని ప్రయోగించింది.  2019, ఆగ‌స్టు 14వ తేదీ నుంచి ఫైస‌ల్ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. 


logo