మంగళవారం 19 జనవరి 2021
National - Dec 28, 2020 , 16:06:23

ప్ర‌ముఖ సెక్సాల‌జిస్టు మ‌హింద‌ర్ వ‌త్స క‌న్నుమూత‌

ప్ర‌ముఖ సెక్సాల‌జిస్టు మ‌హింద‌ర్ వ‌త్స క‌న్నుమూత‌

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైకి చెందిన ప్ర‌ముఖ సెక్సాల‌జిస్టు డాక్ట‌ర్ మ‌హింద‌ర్ వ‌త్స (96) ఇక‌లేరు. గ‌త కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వ‌త్స‌ ఈ ఉద‌యం త‌న నివాసంలో క‌న్నుమూశార‌ని కుటుంస‌భ్యులు తెలిపారు. మ‌హింద‌ర్ వ‌త్స ముంబై మిర్ర‌ర్ ప‌త్రిక‌లో 'ఆస్క్ ద సెక్స్‌ప‌ర్ట్' పేరుతో కాలమ్ రాసేవారు. దాదాపు 15 ఏండ్ల‌కుపైగా ముంబై మిర్ర‌ర్‌లో ఆ కాల‌మ్ కొన‌సాగింది. ఇప్ప‌టికీ చాలామంది సెక్స్ గురించి బ‌హిరంగంగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నా.. మ‌హింద‌ర్ వ‌త్స మాత్రం చాలా ఓపెన్‌గా చ‌ర్చించేవారు.

అది అంగ‌స్తంభ‌న స‌మ‌స్య గానీ, శీఘ్ర స్క‌ల‌న స‌మ‌స్య గానీ, గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌స్య‌గానీ, మ‌ధ్య వ‌య‌సులో గ‌ర్భం రావ‌డం గానీ ఇలా స‌మ‌స్య ఏదైనా మ‌హింద‌ర్ వ‌త్స చాలా ఓపెన్‌గా మాట్లాడేవారు. 'ఆస్క్‌ ద సెక్స్‌ప‌ర్ట్' కాల‌మ్ ద్వారా చ‌మ‌త్కారంగా స‌మాధానాలు ఇస్తూ లైంగిక స‌మ‌స్య‌ల‌పై ఎంతో మందికి అవ‌గాహ‌న క‌ల్పించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.