మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 15:16:51

ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అతలాకుతలం

ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అతలాకుతలం

ముంబై : ముంబై మహానగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై మోకాళ్లోతు వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదర్, హింద్మాతా తదితర లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో చెరువులను తలపించాయి. నేవీ ముంబై పరిధిలోని వాషి ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

గడిచిన 24 గంటల్లో ముంబై పరిసర ప్రాంతాల్లో రికార్డుస్థాయి వర్షం కురిసింది. కొలాబాలో 60 మి.మీ వర్షం కురువగా థానేలో ఇంచుమించు ఇదేస్థాయిలో పడింది. నగరంలో రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ముంబై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.logo