గురువారం 04 జూన్ 2020
National - May 24, 2020 , 09:46:19

పలు రాష్ర్టాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ

పలు రాష్ర్టాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ

ఢిల్లీ : దేశంలోని పలు రాష్ర్టాలకు భారత వాతావరణశాఖ తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీచేసింది. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌కు. రాజస్థాన్‌ రాష్ట్రం నేడు తీవ్ర వడగాలుల ప్రభావానికి గురికానున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఛండీఘర్‌, రాష్ర్టాల్లో కూడా ఈ వేడిగాలుల ప్రభావం కొనసాగనున్నట్లు పేర్కొంది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఛండీఘర్‌, విదర్భ  ప్రాంతాల్లో రానున్న 4-5 రోజులు వడగాలులు వీయనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో రానున్న మూడు రోజులు... మరట్వాడా, రాయలసీమలో రానున్న రెండు రోజులు ఈ వేడి గాలుల ప్రభావం కొనసాగనున్నట్లు తెలిపింది. కాగా మరోవైపు ఈశాన్య రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఈ నెల 26 నుంచి 28 వరకు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. 


logo