మంగళవారం 07 జూలై 2020
National - Jun 22, 2020 , 16:23:16

బీహార్‌, అస్సాంలకు తీవ్ర వరద సూచన

బీహార్‌, అస్సాంలకు తీవ్ర వరద సూచన

న్యూఢిల్లీ : బీహార్‌, అస్సాం రాష్ర్టాలకు తీవ్ర వరదలు వచ్చే అవకాశముందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) హెచ్చరించింది. అస్సాంలోని పలు నదులు గరిష్ఠ స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) వెల్లడించిందని పేర్కొంది. అస్సాంలోని సిబ్‌సాగర్‌ జిల్లా నాగలమోరాఘాట్‌లోని దిస్సాంగ్‌ నది, గోలాఘాట్‌ జిల్లాలోని నాగలమోరాఘాట్‌ (దక్షిణభాగంలోని)ధన్‌శ్రీ నది, జోహట్‌ జిల్లా నిమటిఘాట్‌లోని బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఎన్‌డీఎంఏ తెలిపింది. సొనత్‌పూర్‌ జిల్లాలోని జయబరేలీ నది, నాగలమోరాఘాట్‌లోని దిస్సాంగ్‌ నదులు ఆయా జిల్లాల్లో వరదలకు కారణమయ్యే అవకాశముంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలోనిదుమరియ ఘాట్‌లో ప్రవహించే గండక్‌ నది సీతామర్హి జిల్లాలోని రున్నిసైద్‌పూర్‌ వద్ద భాగమతి నదితో కలిసి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపింది.logo