గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 14:44:07

రానున్న మూడురోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

రానున్న మూడురోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని  డెహ్రాడూన్‌ భారత వాతావరణశాఖ అధికారి బిక్రమ్‌ సింగ్‌ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని డెహ్రాడూన్‌,  నైనిటాల్‌, తెహ్రీ, పౌరి, అల్మోరా, పితోర్‌గర్‌ తదితర జిల్లాల్లో ఈ నెల 18నుంచి 19వరకు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. నైనిటాల్‌, పితోరాగర్‌  జిల్లాలో వర్షాలతోపాటు భారీ ఈదురుగాలులు సంభవించే అవకాశముందని చెప్పారు. రానున్న 24గంటల్లో నైరుతి రుతుపవనాలు తూర్పు మధ్యప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు విస్తరించనున్నందున పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉండనుందని భారతీ వాతావరణశాఖ తన బులిటెన్లో వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో  రానున్న 2రోజుల్లో మహారాష్ట్ర, ఛతీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, ఒడిశా, ఝార్కండ్‌, బీహార్‌ రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తామని పేర్కొంది.  logo