ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 12:08:58

గంగా న‌దిలో ప‌డ‌వ మున‌క‌.. 100 మంది గ‌ల్లంతు

గంగా న‌దిలో ప‌డ‌వ మున‌క‌.. 100 మంది గ‌ల్లంతు

పాట్నా : బీహార్‌లోని భ‌గ‌ల్‌పూర్ జిల్లాలో విషాదం నెల‌కొంది. 100 మంది రైతులు, కూలీల‌తో వెళ్తున్న ఓ ప‌డ‌వ గంగా న‌దిలో మునిగిపోయింది. టింటంగా దియార వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. సామ‌ర్థ్యానికి మించి ప‌డ‌వ‌లో కూలీల‌ను, రైతుల‌ను ఎక్కించ‌డ‌మే కాకుండా.. సైకిళ్లు, బైక్‌లతో న‌దిని దాటే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. గ‌ల్లంతైన వారి కోసం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బాధిత కుటుంబాల స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.