శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 20:16:17

శోభాయ‌మానంగా అయోధ్య‌..వీడియో

శోభాయ‌మానంగా అయోధ్య‌..వీడియో

ల‌క్నో: అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం ఈ నెల 5న శంకుస్థాప‌న‌ కార్య‌క్ర‌మం జ‌రుగనున్న‌ది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌హా వివిధ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. ప్ర‌ధాని చేతుల మీదుగానే పునాది రాయి వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అయోధ్య‌తోపాటు ఆ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. ప్ర‌ధాని వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా విభాగానికి చెందిన బ‌ల‌గాలు రంగంలోకి దిగి అయోధ్య‌లో ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నాయి. 

కాగా, ప‌లువురు ప్ర‌ముఖుల రాక నేప‌థ్యంలో అధికారులు అయోధ్య న‌గ‌రాన్ని శోభాయ‌మానంగా తీర్చిదిద్దారు. రంగురంగుల దీప కాంతుల న‌డుమ అయోధ్య‌పురి ద‌గ‌ద‌గ మెరిసిపోతున్న‌ది. అయోధ్య‌లోని సుంద‌ర దృశ్యాలు చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఆయోధ్య సుంద‌ర దృశ్యాల‌ను మీరు కూడా ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo