ఉప్పెన చిత్రంతో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంది యువ నటి కృతిశెట్టి. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఉప్పెన తర్వాత వరుస ఆఫర్లు కృతిశెట్టి తలుపు తట్టాయి. ప్రస్తుతం నానితోపాటు పలు హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ మంచి నటి, డ్యాన్సర్ అని తెలిసిందే. అయితే ఎవరికి తెలియని ఇంకో టాలెంట్ కృతిశెట్టిలో ఉందట. ఇంతకీ అదెంటో తెలుసా..? సింగింగ్. మరి ఈ విషయాన్ని లీక్ చేసిందెవరో కాదు.
కృతిశెట్టి కోస్టార్ వైష్ణవ్ తేజ్. ఈ హీరో ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చేసిన ఇంటరాక్షన్ లో కృతిశెట్టి మంచి గాయని కూడా అని చెప్పుకొచ్చాడు. ఇది తెలుసుకున్న చాలా మంది ఉప్పెన భామ అందం, అభినయంతో అలరించడమే కాకుండా గాత్రంతో కూడా అందరినీ ఎంటర్ టైన్ చేసే రోజు కూడా త్వరలోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!