శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 17:56:27

ఛత్తీస్‌గఢ్‌లో గ్యాస్‌లీక్‌: ఏడుగురికి అస్వస్థత

ఛత్తీస్‌గఢ్‌లో గ్యాస్‌లీక్‌: ఏడుగురికి అస్వస్థత

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీకై ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. టేట్లా గ్రామంలో ఉన్న శక్తి పేపర్‌ మిల్లు కొవిడ్‌-19 కారణంగా గత కొన్నిరోజులుగా మూతపడి ఉన్నది. ఈ పేపర్‌మిల్లును తెరిచే ప్రయత్నంలో శుభ్రపరిచేందుకు పలువురు కార్మికులను పురమాయించారు. బుధవారం రాత్రి పేపర్‌ వేస్ట్‌తో నిండివున్న ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌ లీకైంది. దాంతో శుభ్రపరిచే విధుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని రాయ్‌గఢ్‌ ఎస్పీ సంతోష్‌కుమార్‌ సింగ్‌  తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణులు మిల్లుకు చేరుకొని గ్యాస్‌లీక్‌కు గల కారణాలను తెలుసుకొంటున్నారు.


logo