బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 09:42:18

నేడు వందేభార‌త్ మిష‌న్‌లో ఏడు ప్ర‌త్యేక విమానాలు

నేడు వందేభార‌త్ మిష‌న్‌లో ఏడు ప్ర‌త్యేక విమానాలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని వాయు మార్గాన భార‌త్‌కు త‌ర‌లించేందుకు చేప‌ట్టిన వందేభార‌త్ మిష‌న్ ఐదు రోజులుగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. ఐదో రోజైన సోమ‌వారం ఏడు ప్ర‌త్యేక విమానాలు వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా న‌డువ‌నున్నాయి. ఈ ఏడు ప్ర‌త్యేక విమానాల్లో ఒక విమానం ఇప్ప‌టికే 300 మంది ప్ర‌యాణికుల‌తో లండ‌న్ నుంచి బ‌య‌లుదేరి ఢిల్లీ మీదుగా ఈ తెల్ల‌వారుజామున బెంగ‌ళూరుకు చేరుకుంది.

ఇక మ‌రో ఆరు విమానాల్లో ఒక‌టి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైద‌రాబాద్‌కు రానుంది. మ‌రో విమానం ఢాకా నుంచి ముంబైకి, ఇంకో దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకోనున్నాయి. మిగ‌తా మూడు విమానాల్లో ఒక‌టి అబుదుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు, మ‌రొక‌టి కౌలాలంపూర్ నుంచి చెన్నైకి, ఇంకొక‌టి బ‌హ్రెయిన్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంటాయి.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo