శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 12:30:22

కారును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

కారును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఉద‌యం సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లా ప‌త్డి ఏరియాలో ఎదురెదురుగా వ‌చ్చిన కారు, లారీ (డంప‌ర్‌) ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారులో ఉన్న ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. కారు పూర్తిగా ధ్వంస‌మ‌వ‌గా, డంప‌ర్ ముందు భాగం స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్న‌ది. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ప‌రారీలో ఉన్న డంప‌ర్ డ్రైవ‌ర్ కోసం గాలింపు చేప‌ట్టారు. 

కాగా, గుజ‌రాత్‌లో గ‌త మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం ఇది రెండోసారి. గ‌త బుధ‌వారం వ‌డోద‌ర‌లో ఎదురెదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులు ఢీకొని 11 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డి వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ విషాదాన్ని మ‌ర్చిపోక‌ముందే సురేంద్ర‌న‌గ‌ర్ జిల్లాలో ఇప్పుడు మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.