సోమవారం 01 జూన్ 2020
National - May 10, 2020 , 10:29:29

అమెరికా నుంచి 7 విమానాల్లో భార‌తీయుల‌ త‌ర‌లింపు..

అమెరికా నుంచి 7 విమానాల్లో భార‌తీయుల‌ త‌ర‌లింపు..

హైద‌రాబాద్‌: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నుంచి భార‌త్‌కు తొలి విమానం బయ‌లుదేర‌నున్న‌ది. మొత్తం 4 భిన్న ప్రాంతాల నుంచి ఏడు విమానాలు ఇండియాకు న‌డుపుతున్న‌ట్లు దౌత్య‌వేత్త త‌ర‌ణ్‌జిత్ సింగ్ సంధు తెలిపారు. అన్నీ ఎయిర్ ఇండియా విమానాలే అని, అవ‌న్నీ భార‌త్‌లోని భిన్న న‌గ‌రాల‌కు వెళ్తాయ‌న్నారు.  తొలి వారంలో సుమారు 25వేల మంది ఇండియాకు వెళ్లేందుకు రిజిస్ట‌ర్ చేసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వీరంద‌రికి కోసం ఏడు విమానాలు న‌డుపుతున్న‌ట్లు చెప్పారు. వారి వారి డిమాండ్‌కు త‌గిన‌ట్లు విభిన్న ప్రాంతాల‌కు విమానాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. వందేభార‌త్ మిష‌న్ కింద భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ కొన‌సాగ‌నున్న‌ది.

భార‌త్‌కు చెందిన ఐసీఎంఆర్‌, అమెరికాకు చెందిన సీడీసీ-ఎన్ఐసీలు చాలా ఏళ్ల నుంచి క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఈ ఇద్ద‌రూ  క‌లిసి రెండేళ్ల‌క్రితం రోటోవైర‌స్ కోసం వ్యాక్సిన్ క‌నుగొన్న‌ట్లు తెలిపారు. ఆ వ్యాక్సిన్ వ‌ల్ల భార‌త్‌, అమెరికాతో పాటు అనేక దేశాలు ల‌భాప‌డ్డ‌ట్లు చెప్పారు.  రెండు దేశాలు క‌నీసం మూడు వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఇక స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లోనూ భార‌త్ కీల‌క భూమిక పోషిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీని వ‌ల్ల భార‌త్‌పై అమెరికాకు న‌మ్మ‌కం ఏర్పడిన‌ట్లు చెప్పారు. అమెరికా పెట్టుబ‌డిదారులు, కంపెనీలు భార‌త్ వైపు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయ‌ని, కోవిడ్‌19 సంక్షోభం ముగిసిన త‌ర్వాత అగ్ర‌రాజ్యం మ‌న‌కు మ‌రితం ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.logo