బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 12:04:41

అమెరికా నుంచి ఏడు విమానాల్లో భార‌తీయుల త‌ర‌లింపు

అమెరికా నుంచి ఏడు విమానాల్లో భార‌తీయుల త‌ర‌లింపు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వ‌దేశానికి తీసుకురావ‌డం కోసం ఉద్దేశించిన వందేభార‌త్ మిష‌న్‌ ఫేజ్‌-2 మే 16 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫేజ్‌-2లో భాగంగా అమెరికా నుంచి భార‌తీయుల‌ను త‌ర‌లించే కార్య‌క్ర‌మం మాత్రం మే 19న మొదలు కానుంది. మొత్తం ఏడు ఎయిర్ ఇండియా విమానాల్లో వంద‌ల మంది భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్నారు.  

మే 19 మొద‌లు 21 వ‌ర‌కు అమెరికా నుంచి బ‌యలుదేర‌నున్న‌ ఏడు విమానాల్లో రెండు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి, ఒక‌టి వాషింగ్ట‌న్ నుంచి, రెండు చికాగో నుంచి, మ‌రో రెండు న్యూయార్క్ నుంచి టేకాఫ్ తీసుకోనున్నాయి. కాగా, మే 7 నుంచి 13 వ‌ర‌కు కొన‌సాగిన వందేభార‌త్ మిష‌న్ మొద‌టి ద‌శ‌లో భాగంగా ఆమెరికా నుంచి ఏడు విమానాల్లో 1200 మందిని భార‌త్‌కు తీసుకొచ్చారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo