గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 15:44:23

పుణెలో చైనా జాతీయుడితో సహా ఏడుగురికి కరోనా

పుణెలో చైనా జాతీయుడితో సహా ఏడుగురికి కరోనా

మహారాష్ట్ర : పుణె జిల్లా చకన్‌ పట్టణంలోని ఓ చైనా సంస్థలో పని చేస్తున్న ఆ దేశ జాతీయుడితో సహా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఖేడ్‌ తహసీల్‌ డాక్టర్‌ బలరాం గడావే తెలిపారు. పరికరాల కంపెనీలో ౩౦౦ మంది పని చేస్తున్నారని, గతవారం కిందట ఒకరికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ఆరుగురు చైనా జాతీయులతో పాటు మరో 130 మందికి క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వైరస్‌ బారినపడ్డ ఉద్యోగులు ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. లాక్‌డౌన్‌కు అమలుకు ముందే చైనా ఉద్యోగులు చకన్‌ ప్లాంట్‌కు వచ్చి ఇక్కడే ఇరుక్కు పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. 


logo