మంగళవారం 19 జనవరి 2021
National - Jan 02, 2021 , 12:24:29

ఉగ్ర‌వాదుల గ్రేనేడ్ దాడి.. ఏడుగురికి గాయాలు

ఉగ్ర‌వాదుల గ్రేనేడ్ దాడి.. ఏడుగురికి గాయాలు

పుల్వామా‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు ఇవాళ గ్రేనేడ్ దాడికి పాల్ప‌డ్డారు.  పుల్వామా జిల్లాలోని త్రాల్ బ‌స్సు స్టాండ్ వ‌ద్ద సెక్యూర్టీ ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ల‌తో దాడి చేశారు.  ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పౌరులు గాయ‌ప‌డ్డారు.  గాయ‌ప‌డ్డ వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని జేకే పోలీసులు తెలిపారు.  అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. సహ‌‌స్త్ర సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ)ను టార్గెట్ చేస్తూ ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ల‌ను విసిరారు. కానీ టార్గెట్ త‌ప్ప‌డంతో ఆ గ్రేనేడ్లు రోడ్డుపై పేలాయి. ఆ ప్రాంతాన్ని పోలీసులు దిగ్భందం చేశారు.  భారీ స్థాయిలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.