ఆదివారం 29 మార్చి 2020
National - Mar 23, 2020 , 14:31:35

పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీల గుర్తింపునకు సుప్రీం ఆదేశం

పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీల గుర్తింపునకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ : పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీల తరగతిని నిర్ణయించడానికి ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సి అన్ని రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం ఈ ఆదేశాలను జారీ చేసింది. నాలుగు నుంచి ఆరు వారాలకు పెరోల్‌పై పంపించదగ్గ వారిని గుర్తించాల్సిందిగా పేర్కొంది. దోషులుగా తేలిన వారికి అదేవిధంగా ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో జైలు అధికారుల సూచనల మేరకు పెరోల్‌ను మంజూరు చేయొచ్చని తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్ర లీగర్‌ సర్వీసెస్‌ అథారిటీతో ఖైదీల విడుదలకు సంప్రదింపులు జరిపనుందన్నారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్లలో అధిక సంఖ్యలో ఖైదీలు ఉండటం మంచిది కాదన్న థృక్పదంతో సుప్రీం ఈ తీర్పును ప్రకటించింది.


logo