మంగళవారం 26 జనవరి 2021
National - Dec 30, 2020 , 14:25:40

ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌కు ఇవాళే ఇండియా ఆమోదం !

ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌కు ఇవాళే ఇండియా ఆమోదం !

హైద‌రాబాద్‌:  ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా రూపొందించిన క‌రోనా టీకాకు బ్రిట‌న్ దేశం ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.  అయితే ఇండియాలో ఆ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  భార‌త్‌లోనూ త‌మ వ్యాక్సిన్‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో వినియోగించేందుకు అమ‌నుతి ఇవ్వాలంటూ ఈ నేప‌థ్యంలో సీరం సంస్థ అభ్య‌ర్థ‌న పెట్టుకున్న‌ది. ఈ అంశాన్ని ప‌రిశీలించేందుకు ఇవాళ నిపుణుల క‌మిటీ స‌మావేశం అయ్యింది. ఆ అభ్య‌ర్థ‌న‌కు ఇవాళ ఆమోదం ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఎమ‌ర్జెన్సీ వాడ‌కం కోసం సీరం సంస్థ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను నిపుణుల క‌మిటీ ప‌రిశీలిస్తున్న‌ది.  త‌మ ద‌ర‌ఖాస్తున్న కేంద్రం ప‌రిశీలించ‌నున్న‌ట్లు వ‌స్తున్న వార్తల ప‌ట్ల సీరం చీఫ్ ఆధార్ పూనావాలా సంతోషం వ్య‌క్తం చేశారు.  ఇదో గొప్ప వార్త అని, ఉత్తేజ ప‌రుస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  భార‌తీయ నియంత్ర‌ణ అధికారుల అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  


logo