గురువారం 21 జనవరి 2021
National - Jan 11, 2021 , 16:35:16

ప్ర‌భుత్వం నుంచి వ్యాక్సిన్ ఆర్డ‌ర్లు వ‌చ్చాయి : సీరం సంస్థ‌

ప్ర‌భుత్వం నుంచి వ్యాక్సిన్ ఆర్డ‌ర్లు వ‌చ్చాయి :  సీరం సంస్థ‌

న్యూఢిల్లీ:  ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ టీకా ధ‌ర‌ను రూ.200గా ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఒక్క డోజు ఇంజ‌క్ష‌న్‌ను 200 రూపాయాల‌కే అమ్మాల‌ని నిర్ణ‌యించారు.  అయితే వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు సీరం సంస్థ పేర్కొన్న‌ది.  ఆక్స్‌ఫ‌ర్డ్‌, సీరం సంస్థ‌లు.. కోవీషీల్డ్ టీకాల‌ను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే.  కోవీషీల్డ్ టీకాల కొనుగోలు కోసం ప్ర‌భుత్వం ఇవాళ ఆర్డ‌ర్ చేసింది. ఇక వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ త్వ‌ర‌లో ప్రారంభంకానున్న‌ది. బ‌హుశా రేపు లేదా ఎల్లుండి నుంచి  టీకా పంపిణీ ప్ర‌క్రియ కూడా జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం.  మ‌రో వైపు ఇవాళ ప్ర‌ధాని మోదీ..  వ్యాక్సిన్ రోలౌట్ గురించి సీఎంల‌తో చ‌ర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు.  

కోటి ప‌ది ల‌క్ష‌ల‌ డోసులు..

ఒక డోసును రూ.220కు ఇచ్చేందుకు సీరం సంస్థ టెండ‌ర్ వేసింది.  కానీ దీనిపై ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ కొంత అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.  అయితే ధ‌ర విష‌యంలో బేధాభిప్రాయాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ప‌ర్‌చేజ్ ఆర్డ‌ర్ విష‌యంలో ఎటువంటి అగ్రిమెంట్ జ‌ర‌గ‌లేద‌ని కూడా కొన్ని వార్త‌ల ద్వారా తెలుస్తోంది.  మ‌రోవైపు ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఇచ్చే వ్యాక్సిన్ ఖ‌ర్చును కేంద్ర‌మే భ‌రించ‌నున్నారు.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కోసం అన్ని ఏర్పాట్లు జ‌రిగిన‌ట్లు కేంద్రం చెప్పింది.  హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు టీకా ఖ‌ర్చుల‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వ భ‌రించ‌నున్న‌ది. సీరం సంస్థ నుంచి కోటి ప‌ది ల‌క్ష‌ల కోవీషీల్డ్ టీకాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆర్డ‌ర్ చేసింది.  ఇవాళ సాయంత్రం నుంచే టీకాల‌ను సీరం సంస్థ ఆయా కేంద్రాల‌కు బ‌ట్వాడా చేయ‌నున్న‌ది.  


logo