గురువారం 09 జూలై 2020
National - Jun 21, 2020 , 15:40:08

20హత్య కేసుల్లో దోషి.. జూన్‌ 14శిక్ష ఖరారు.!

20హత్య కేసుల్లో దోషి.. జూన్‌ 14శిక్ష ఖరారు.!

మంగళూర్‌ : మహిళతో స్నేహంగా ఉండి ఆమెకు సైనేడ్‌ ఇచ్చి లైంగికదాడికి పాల్పడి హతమార్చిన కేసులో అరెస్టయిన సీరియర్‌ కిల్లర్‌ మోహన్‌కు ఈనెల 24న శిక్ష ఖరారు కానుంది. ఇదే రీతిలో 20మందిని హతమార్చినట్లు నిందితుడిపై అభియోగాలున్నాయి.

ప్రాసిక్యూషన్‌‌ తెలిపిన వివరాలివి..  2009లో కర్ణాటక రాష్ట్రంలోని కాసరగోడ్‌ ప్రాంతంలో లేడీస్‌ హాస్టల్‌లో పని చేసే 25ఏండ్ల యువతితో మోహన్‌కు పరిచయం ఏర్పడింది. తరచూ ఆమె ఇంటికి వెళ్లి సన్నిహితంగా మెలిగి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓ రోజు బెంగళూర్‌కు తీసుకెళ్లి అదేసమయంలో కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా తమకు వివాహం జరిగిందని తొందర్లో ఇంటికి వస్తామని చెప్పాడు. అక్కడ నుంచి ఆమెను బస్టాండ్‌ సమీపంలోని లాడ్జీకి తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. మరుసటి రోజు ఓ చోటుకు వెళ్దామని చెప్పి నగలను గదిలో పెట్టి రమ్మని బస్టాండ్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ ఆమెతో గర్భనిరోధక మాత్ర అని చెప్పి సైనేడ్‌ కూర్చిన మాత్ర మింగించాడు. కాసేపటికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆమె అందులోనే కుప్పకూలింది. అక్కడి కానిస్టేబుల్‌ హుటాహుటిన దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత అదే ఏడాది అక్టోబర్‌లో ఇదే తరహా కేసులో మోహన్‌  అరెస్టు కావడంతో ఆ ఫొటోలను చూసిన బాధితురాలి చెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది. గతంలో ఈ కేసును పబ్లిక్‌ ప్రానిక్యూటర్‌ జ్యూడిత్‌ ఓఎం క్రాస్టా వాదించగా, ఆయన నుంచి జయరాంశెట్టికి బదిలీ అయ్యింది.


logo