గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 12:21:11

క‌శ్మీర్ వేర్పాటువాది.. హురియ‌త్‌కు గిలానీ గుడ్‌బై

క‌శ్మీర్ వేర్పాటువాది.. హురియ‌త్‌కు గిలానీ గుడ్‌బై

హైద‌రాబాద్‌:  క‌శ్మీర్ వేర్పాటువాద‌ నేత స‌య్య‌ద్ అలీ షా గిలానీ.. హురియ‌త్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తన నిర్ణ‌యానికి సంబంధించి ఓ ఆడియో మెసేజ్‌ను ఆయ‌న రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా.. ఆల్ పార్టి హురియ‌ల్ కాన్ఫ‌రెన్స్ నుంచి రిజైన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హురియ‌త్‌లోని అన్ని భాగ‌స్వాముల‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దాదాపు 27 ఏళ్ల నుంచి హురియ‌త్‌తో ఆయ‌న‌కు అనుబంధం ఉన్న‌ది. 

1993 నుంచి హురియ‌త్‌లో గిలానీ భాగ‌స్వామిగా ఉన్నారు.  2003లో ఆయ‌న్ను జీవితకాల చైర్మ‌న్‌గా ప్ర‌క‌టించారు.  అయితే త‌న రాజీనామాకు స‌రైన కార‌ణాల‌ను ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. కొన్ని నెల‌ల నుంచి గిలానీ ఆరోగ్యం స‌రిగాలేదు. ప్ర‌స్తుతం వైద్యం తీసుకుంటున్నా.. నిల‌క‌డ‌గానే ఉన్నారు.  


logo