గురువారం 28 జనవరి 2021
National - Dec 04, 2020 , 12:04:57

45 వేల పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ట్రేడింగ్‌..

45 వేల పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ట్రేడింగ్‌..

హైద‌రాబాద్‌:  జీడీపీ వృద్ధి రేటును రిజ‌ర్వ్ బ్యాంక్ స‌వ‌రించ‌డంతో.. భార‌త స్టాక్ మార్కెట్లు దూసుకువెళ్తున్నాయి.  ఇవాళ సెన్సెక్స్ తొలిసారి 45 వేల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి మైన‌స్ 9.5 నుంచి మైన‌స్ 7.5కి చేర‌నున్న‌ట్లు ఇవాళ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.  దీంతో స్టాక్ మార్కెట్లు ప‌రుగులు తీశాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 355.79 పాయింట్లు దూసుకువెళ్లింది. ఇక నిఫ్టీ ట్రేడింగ్‌లో 101.80 పాయింట్లతో 13,235 వ‌ద్దకు చేరుకున్న‌ది. కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌ధాత‌థంగా ఉంచుతున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ఇవాళ ఉద‌యం తెలిపారు.  వ‌డ్డీ రేట్ల‌ను య‌థావిధిగా కొన‌సాగించ‌డం ఇది వ‌రుస‌గా మూడోసారని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ వెల్ల‌డించారు. మానిట‌రీ పాల‌సీ క‌మిటీ దీనికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింద‌ని ఆయ‌న తెలిపారు. రివ‌ర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగానే కొన‌సాగుతోంది. కొవిడ్‌-19 ప్ర‌భావాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కూ త‌గ్గిస్తూ.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్ర‌ణ‌లో ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా మానిట‌రీ పాల‌సీ క‌మిటీ నిర్ణయాలు తీసుకుంటోంద‌ని శ‌క్తికాంత దాస్ చెప్పారు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే అప్పుపై విధించే వ‌డ్డీ రేటు. logo