గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 19:05:41

కరోనాతో ఢిల్లీలో సీనియర్‌ డాక్టర్‌ మృతి

కరోనాతో ఢిల్లీలో సీనియర్‌ డాక్టర్‌ మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని కొవిడ్‌-19 దవాఖానలో పని చేస్తున్న సీనియర్ డాక్టర్ ఆదివారం కన్నుమూశారు. డాక్టర్ ఆషీమ్ గుప్తా లోక్‌ నాయక్ జయ్ ప్రకాశ్ దవాఖానలో అనస్థీషియా స్పెషలిస్టుగా పని చేస్తున్నారు. ఐసీయూలో నియమించిన అనష్థీషియా స్పెషలిస్ట్‌ కరోనా వైరస్‌ బారిన పడడంతో గత రెండు వారాలుగా సాకేత్‌లోని మ్యాక్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన భార్య కూడా కొద్ది రోజుల కిందట కరోనా వైరస్‌ బారినపడగా, కొలుకున్నారు. ఆయన కుమారుల్లో ఒకరు ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తుండగా, మరొకరు మెడిసిన్‌ చదువుతున్నారు. కాగా, దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సుమారు 300 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ విస్తరిస్తున్న క్రమంలో లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ దవాఖానను ఢిల్లీ ప్రభుత్వం మార్చి 17న కొవిడ్‌-19న ప్రత్యేక హాస్పిటల్‌గా ప్రకటించింది. 


logo