శనివారం 06 జూన్ 2020
National - May 24, 2020 , 09:50:43

కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ మృతి

కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ మృతి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్‌ జితేంద్ర నాథ్‌ పాండే(78) శనివారం కన్నుమూశారు. గత కొన్ని వారాల నుంచి కరోనా బాధితులకు జితేంద్ర నాథ్‌ పాండే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్‌ సోకి మృతి చెందారు. పల్మనాలజీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా జితేంద్ర నాథ్‌ కొనసాగుతున్నారు. డాక్టర్‌ పాండే భార్యకు కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే పాండేకు కరోనా సోకినప్పటి నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా వెల్లడించారు. పాండే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నిన్న రాత్రి ఆయన డిన్నర్‌ చేసిన తర్వాత.. నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత కన్నుమూశారు అని గులేరియా స్పష్టం చేశారు. డాక్టర్‌ పాండే మృతి పట్ల ఎయిమ్స్‌ వైద్యులు, సిబ్బంది నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. పాండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


logo