శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 16:30:21

సరిహద్దు రక్షణకు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని పంపండి

సరిహద్దు రక్షణకు ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని పంపండి

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నాయకుడు హుస్సేన్‌ దళవాయి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సరిహద్దు రక్షణకు ఆర్‌ఎస్ఎస్ వారిని పంపాలని అన్నారు. చైనా దళాలతో మాట్లాడేందుకు భారత సైనికులను కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు లేకుండా పంపిందని ఆరోపించారు. సైనికులను పంపే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పట్టించుకోకపోవడంతో అనుకోకుండా 20మంది సైనికులను కోల్పోయామన్నారు. కాలి చేతులతో మన సైనికులు వెళ్తే.. వారు (చైనా దళాలు) మేకులు కొట్టిన రాడ్లతో వచ్చారని ఆరోపించారు. జవాన్లను ఖాళీ చేతులతో ఎలా పంపుతారని.. వారు పోరాడేందుకు అవకాశమే లేకుండా పోయిందన్నారు. ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ వద్ద కర్రలున్నాయని, వారిని పంపితే సరిహద్దును రక్షిస్తారని ఎద్దెవా చేశారు. ఇదిలా ఉండగా భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 
logo