బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 18:00:50

అమ్మకోసం ఒక పాప..గుక్కపెట్టి ఏడుస్తున్నది..

అమ్మకోసం ఒక పాప..గుక్కపెట్టి ఏడుస్తున్నది..

 ఒక యువకుడు...ఓపికగా సముదాయిస్తున్నాడు. ఒక మహిళ...హాస్పిటల్‌లో నుంచి బయటికి వచ్చింది. అంతలోనే ఆమె కూడా ఏడవసాగింది. ఎక్కువసేపు అక్కడ ఉంటే బాగుండదని అనిపించిందో ఏమో...లోపలికి వెళ్లిపోయింది. పాప ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఇంతకీ ఎవరు వాళ్లు? ఏమైంది?

(యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్న ఓ వీడియో వెనుక ఉన్న గుండెకోత ఇది...)

కర్ణాటకలోని బెళగావి. గుక్కపెట్టి ఏడుస్తున్న పాప పేరు ఐశ్వర్య. హాస్పిటల్లోంచి వచ్చిన మహిళ ఐశ్వర్య తల్లి సుగంధ. సముదాయిస్తున్న వ్యక్తి పాప తండ్రి సంతోష్‌. ఐశ్వర్య వయసు మూడేండ్లు. ఒక్కతే పాప. గారాలపట్టి. మరి.. పాప అంతగా ఏడుస్తుంటే కనీసం దగ్గరకు కూడా ఎందుకు వెళ్లలేదు ఆమె? ఎందుకంటే... బిడ్డను ముద్దాడాలన్న మమకారాన్ని చంపుకుని మరీ... ఎమర్జెన్సీ వార్డులోని రోగులను బతికిస్తున్న నర్సమ్మ ఆమె! కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి 8 రోజులు సేవచేసింది. ఇప్పుడు ఆమె 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లింది. అమ్మతనం, వృత్తిధర్మం... రెండింటి మధ్య నలిగిపోయిన ఆ క్షణం గురించి సుగంధ మాటల్లోనే...   పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి>>   సెల్యూట్‌... సుగంధా!logo