మంగళవారం 19 జనవరి 2021
National - Jan 12, 2021 , 01:35:38

వెయ్యేండ్లు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌!

వెయ్యేండ్లు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌!

  • ఊరి చుట్టూ గోడ కట్టుకొని లోపలే జీవనం
  • పనికోసం పురుషులు మాత్రమే బయటకు 
  • మహిళలకు గ్రామం తప్ప మరో లోకం లేదు
  • తమిళనాడులో శ్రీవైకుంఠం గ్రామం ప్రత్యేకత

ఓ చిన్న గ్రామం. అందులో 65 కుటుంబాలు. ఊరు చుట్టూ పెద్ద మట్టిగోడ. లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా ఆ మట్టిగోడకు దిక్కుకొకటి చొప్పున నాలుగే ద్వారాలు. మట్టిగోడ లోపల ఉన్న కుటుంబాల్లో మహిళలకు బయటి ప్రపంచం తెలియదు. పురుషులే పనుల కోసం బయటికి వస్తారు. దక్షిణ తమిళనాడులోని శ్రీ వైకుంఠం గ్రామం ప్రత్యేకత ఇది. వెయ్యేండ్లుగా అక్కడి ప్రజలు అలాగే జీవిస్తున్నారు. కాలక్రమంలో మార్పులు వస్తున్నా ఇంకా అక్కడి మట్టి గోడలు, వృద్ధులు నాటి సంస్కృతి సంప్రదాయాలకు సాక్షీభూతులుగా ఉన్నారు. నెలరోజులు లాక్‌డౌన్‌ అంటేనే అమ్మో అనుకుంటున్నాం.. వాళ్లు  వందల ఏండ్లు తమను తాము లాక్‌డౌన్‌ చేసుకొని జీవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.